అధికార పార్టీదే హవా
కోదాడ: రెండో విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో అనంతగిరి, మునగాల మినహా మిగతా మండలాల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుదారులు నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక పోయారు. మునగాల మండలంలో సీపీఎం అభ్యర్థులు కూడా గట్టిపోటీ నిచ్చారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థులు ఎక్కడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సమన్వయ కమిటీలు నిర్ణయించిన అభ్యర్థులపై తలపడిన రెబల్స్ పలుచోట్ల విజయం సాధించారు. మొత్తం 181 పంచాయతీలకు 22 కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా 91 చోట్ల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీఆర్‌ఎస్‌కు ఒక పంచాయతీ ఏకగ్రీవమై 39 పంచాయతీల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు, సీపీఐ నాలుగు, సీపీఎం 6, ఇండిపెండెంట్ అభ్యర్థులు 15 పంచాయతీల్లో విజయం సాధించారు.
మాజీ ఎమ్మెల్యేలకు మోదం.. ఖేదం..
కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు తన స్వంతగ్రామమైన అనంతగిరిలో తాను ఏరికోరి నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించలేక పోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. మరో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తన స్వగ్రామం నడిగూడెం మండలం కరివిరాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అనంతగిరి మండలం అనంతగిరి, మొగలాయికోట, వెంకట్రాంపురం, కొత్తగోల్‌తండా, కోదాడ మండలం గణపవరం, బీక్యాతండా, రామలక్ష్మీపురం, ఎర్రవరం, మంగలితండా, రెడ్లకుంట మునగాల మండలం కోదండరామాపురం, నడిగూడెం మండలం సిరిపురం, చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు.
పోరాడి గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు..
కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ మండలంలో అతిపెద్ద గ్రామమైన కాపుగల్లులో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయబావుటా ఎగురవేశారు. అనంతగిరి మండలంలో బీఆర్‌ఎస్ గట్టిగానే పోటీనిచ్చింది. ఈ మండలంలోని చనుపల్లి, అమీనాబాద్, బొజ్జగూడతండా, త్రిపురవరం గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మునగాల మండలంలో నేలమర్రి, రేపాల, బరాఖత్‌గూడెం, తిమ్మారెడ్డిగూడెం, వెంకట్రాంపురం, మాధవరం గ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. చిలుకూరు మండలం దూదియతండాలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో 10 గ్రామాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇదే నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆరు గ్రామాల్లో విజయ దుందుభి మోగించారు. కోదాడ మండలం అళ్వాలపురం, అనంతగిరి మండలం శాంతినగర్‌లో సీపీఐ విజయం సాధించగా, మునగాల మండలం కొక్కిరేణి, నారాయణగూడెం, నర్సింహులగూడెం, జగన్నాథపురం, కలకోవ గ్రామాల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. బీజేపీ మద్దతుదారులు చివ్వెంల మండలం తుల్జారావుపేట, పెన్‌పహాడ్ మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు.
రెండు విడతల్లోనూ..
జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు మొదటి విడత ఫలితాలనే పునరావృతం చేశాయి. రెండు విడతల్లోనూ అధికార పార్టీ మద్దతుదారులదే పైచేయిగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మొదటి విడతలో 90 పంచాయితీలను కై వసం చేసుకోగా, రెండో విడతలో 91 స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ మొదటి విడతలో 50 పల్లెల్లో పాగా వేయగా రెండో విడతలో 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ రెండు విడతల్లోనూ కేవలం 5 పంచాయతీల్లో గెలిచింది. వామపక్షాలు తొలి విడతలో 9, రెండో విడతలో పది స్థానాల్లో విజయం సాధించింది. ఇక మొదటి విడతలో స్వతంత్రులు ఇద్దరు, రెండో విడతలో 15 మంది గెలిచారు. వీరిలో ఎక్కువ మంది కోదాడకు చెందిన కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు.
తొలివిడత మలివిడత
ఎన్నికలు జరిగినవి 159 158
(ఏకగ్రీవాలుపోను)
కాంగ్రెస్ 90 91
బీఆర్‌ఎస్ 55 39
బీజేపీ 03 02
సీపీఐ 02 04
సీపీఎం 07 06
స్వతంత్రులు 02 15
రెండో విడతలో పార్టీల వారీగా గెల్చుకున్న స్థానాలు
మండలం జీపీలు ఏ/కా కాంగ్రెస్ ఏ/బీ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ సీపీఎం ఇండి
అనంతగిరి 20 03 11 00 04 00 01 00 01
చిలుకూరు 17 04 08 01 01 00 02 01 00
నడిగూడెం 16 03 08 00 03 00 00 00 02
మునగాల 22 01 08 00 06 00 00 05 01
కోదాడ 16 02 12 00 01 00 01 00 00
మోతె 29 07 10 00 08 00 00 00 04
చివ్వెంల 32 02 14 00 10 01 00 00 05
పెన్‌పహాడ్ 29 00 20 00 06 01 00 00 02
మొత్తం 181 22 91 01 39 02 04 06 15
(మునగాల పంచాయతీ ఫలితం వెలువడాల్సి ఉంది.)
రెండో విడత పల్లె పోరులో అధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్‌కే..
ఫ 91 పంచాయతీల్లో
ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు
ఫ 15 చోట్ల సత్తాచాటిన కాంగ్రెస్ రెబల్స్
ఫ 39 గ్రామాల్లో బీఆర్‌ఎస్
మద్దతుదారుల విజయం
అధికార పార్టీదే హవా
అధికార పార్టీదే హవా


