నేటితో మూడో విడత ప్రచారానికి తెర
తాయిలాల పంపిణీకి ఏర్పాట్లు
హుజూర్‌నగర్ : ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మొత్తం 124 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందిని నియమించి రెండు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు.
ఏడు మండలాల్లో ఎన్నికలు
జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో హుజూర్‌నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లోని తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 146 గ్రామ పంచాయతీలు, 1,316 వార్డులకు 22 పంచాయతీలు, 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 124 గ్రామపంచాయతీలు, 1,060 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు.
16న పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
ఈనెల 17న మూడో విడత ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషనన్ సెంటర్లకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. 16వ తేదీన ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్‌న్ సెంటర్ల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించి అధికారులు వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తారు.
ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగియనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు మిగిలిన రెండు రోజులు కీలకంగా మారాయి. దీంతో అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తమ అనుచరగణం ఓటర్లకు రహస్యంగా తాయిలాలు, మద్యం, మాసం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్నిచోట్ల పైచేయి సాధించేందుకు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. మేజర్ గ్రామ పంచాయతీలలో కొందరు ఓటుకు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చికెన్, మద్యం పంపిణీ చేసినట్లు తెలిసింది.
ఫ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు
చేరిన పోలింగ్ సామగ్రి
ఫ ఇప్పటికే సిబ్బందికి
రెండు విడతల్లో శిక్షణ పూర్తి
ఫ 16న పోలింగ్ కేంద్రాలకు
తరలనున్న సిబ్బంది
ఫ 124 పంచాయతీల్లో
ఈనెల 17న తుది దశ పోలింగ్


