రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి
కోదాడ: రిమాండ్ ఖైదీగా ఉన్న దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి, రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. రాజేష్ తల్లి రెండుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా నేటికీ కేసు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. ఈ నెల 22న నిర్వహించనున్న చలో కోదాడ కార్యక్రమానికి వేలాదిమంది తరలిరావాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాదిగ, బీఆర్‌ఎస్ నాయకుడు ఎస్‌కె.నయీం, బీజేపీ నాయకుడు జనార్దన్‌రావు, సీపీఐఎంఎల్ నాయకుడు రవి, పిట్టల భాగ్యమ్మ, సోమశేఖర్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, దైద సత్యం, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, చీమ శ్రీనివాసరావు, కర్ల సుందర్‌బాబు, సత్యరాజు, కృష్ణ, భిక్షం, నాగరాజు పాల్గొన్నారు.
ఫ రాజేష్ మృతిపై అఖిలపక్ష
నాయకుల డిమాండ్


