కూరగాయల సాగుకు ప్రోత్సాహం
రైతులను ప్రోత్సహిస్తున్నాం
సూర్యాపేట : బరిలో నిలిచిన అభ్యర్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకుడు రవినాయక్, ఎస్పీ నరసింహులు అన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సూర్యాపేట మండల పరిధిలోని సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఖర్చులు పెట్టాలని సూచించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ, ఎస్‌ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : కూరగాయల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కొత్తగా కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 350 ఎకరాల్లో సాగు పెంచనుంది. హెక్టార్‌కు గరిష్టంగా రూ.24 వేలు, ఎకరాకు రూ.9,600 రాయితీ అందించనుంది.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
ఎన్‌ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. కానీ, జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని అన్ని రకాల కూరగాయల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, పంజాబ్ నుంచి ఆలుగడ్డ, బెంగళూరు నుంచి క్యారెట్, బీట్‌రూట్ దిగుమతి చేసుకుంటున్నారు.
కోతులతో సాగుకు వెనుకంజ
చాలా ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వడం లేదని భయాందోళనతో రైతులు కూరగాయల సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోతులను నివారించేందుకు టపాసులు పేల్చడం, మంకీగన్స్ ఉపయోగించడం, పంట చుట్టూ జే వైర్ లాంటివి కట్టాలంటే.. అధిక శ్రమకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల ఆవరణలో సొరకాయ ఇతర కూరగాయ పంటలు సాగు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల వల్ల ఇంటి ఆవరణల్లో కూరగాయలు సాగు చేయడం లేదు.
రాయితీ పొందడం ఇలా..
కూరగాయల పంటలను సాగు చేసుకునే రైతులు ముందుగా ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తారు. కూరగాయల నారును హైదరాబాద్‌లోని జీడిమెట్లలో గల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పెంచుతున్నారు. అక్కడి నుంచి నారు పొందితే రాయితీ డబ్బును.. నారు అందించిన కంపెనీకి చెల్లిస్తారు. కూరగాయల విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 250 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పందిరి సాగుతోపాటు ఇతర కూరగాయల సాగును ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్‌లో డిమాండ్ ఉన్నవి పండించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. రాయితీలతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
– కె.సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి, నల్లగొండ
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 350 ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యం
ఫ విత్తనాలు, నారు కొనుగోలుకు ఉద్యానశాఖ రాయితీ
ఫ కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
కూరగాయల సాగుకు ప్రోత్సాహం


