పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయండి
అర్వపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు జాగ్రత్తగా జారీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం అర్వపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్టేజ్–1, 2 అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6 నుంచి 9 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి స్టేజ్–1 ఆర్‌ఓలు 37ఏ రిజిస్టర్‌లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, స్టేజ్–2 ఆర్‌ఓలు 37సీ రిజిస్టర్‌లో ఎన్నికల్లో విధులు నిర్వర్తించేవారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లను కౌంటింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


