
పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలి
అర్వపల్లి: చిన్నారులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం అర్వపల్లి పీహెచ్‌సీ, జాజిరెడ్డిగూడెం పల్లెదవాఖానాను ఆయన తనఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గర్భిణులు, పిల్లలకు టీకాలు వేయాలని, సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేశ్‌నాయక్, సీహెచ్‌ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్‌వైజర్ లలిత, డాక్టర్ ఉదయ్, నర్సింగ్ అధికారులు సునీత, మాధవి సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్