క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ | - | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

Oct 9 2025 2:39 AM | Updated on Oct 9 2025 2:39 AM

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

ఇటీవల కోదాడకు చెందిన రిటైర్డ్‌ డాక్టర్‌కు డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. మీ పేరుపై ఫేక్‌ సిమ్స్‌, ఆధార్‌ కార్డులు ఓపెన్‌ అయి మనీ లాండరింగ్‌ అయిందని భయపెట్టారు. మీకు ఇల్లీగల్‌ ట్రాన్‌జాక్షన్‌ అవుతున్నాయని, మేము చెప్పినట్టు చేస్తే సేఫ్‌లో ఉంటారని ఆ రిటైర్డ్‌ డాక్టర్‌ను భయపెట్టేవిధంగా మాట్లాడారు. మీరు కొంత అమౌంట్‌ డిపాజిట్‌ చేస్తే సేఫ్‌లో ఉంటారని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన సదరు రిటైర్డ్‌ డాక్టర్‌ తనకున్న నాలుగు బ్యాంక్‌ అకౌంట్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లకు రూ.1.08లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి జిల్లా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా సైబర్‌ కేటుగాళ్ల వలలో పడి చాలా మోసపోతున్నారు.

కోదాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ వ్యాపారవేత్తకు ఇటీవల వాట్సాప్‌కు ఫినాల్టో డాట్‌ ఇండస్‌ అనే కంపెనీ పేరుతో మెసేజ్‌ వచ్చింది. ఈ యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ పెడితే డబుల్‌ అమౌంట్‌ వస్తుందని చెప్పారు. దీంతో అతను మొదట రూ.10వేలు ఇన్వెస్ట్‌ చేస్తే రూ.15వేలు వచ్చాయి. ఆ తర్వాత రూ.30వేలు ఇన్వెస్ట్‌ చేస్తే దీనికి డబుల్‌ వచ్చింది. ఇలా డబుల్‌ అమౌంట్‌ వస్తుండటంతో ఒకేసారి రూ.కోటి ఇన్వెస్ట్‌ చేశాడు. దీంతో ఆ డబ్బులు తిరిగి రాక షాక్‌కు గురయ్యాడు. వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంత అమౌంట్‌ సైతం హోల్డ్‌లో

పెట్టినట్టు చెబుతున్నారు.

ఫ సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కుతున్న వందల మంది బాధితులు

ఫ ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే రూ.8.81కోట్లు కాజేసిన నేరగాళ్లు

ఫ ఇప్పటి వరకు 614 సైబర్‌ క్రైం కేసులు నమోదు

ఫ అనవసరమైన లింక్‌లు క్లిక్‌ చెయ్యొద్దంటున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement