
చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించాలి
నూతనకల్ : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని సకాలంలో గుర్తించి దాని నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో పోషణ మాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకుంటే మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీవాణి, అసిస్టెంట్ సీడీపీఓ సాయిగీత, మండల వైద్యాధికారి లిఖిత్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మంజులత, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ,
ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు