రికార్డు స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి

Oct 1 2025 10:57 AM | Updated on Oct 1 2025 10:57 AM

రికార

రికార్డు స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని తెలంగాణ జెన్‌కో ప్రధాన విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ) మంగేష్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్‌ను కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్‌ పవర్‌హౌస్‌ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్‌ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్‌ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్‌ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్‌ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్‌ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు.

సమస్యలు లేకుండా చూడాలని వినతి

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని సద్దుల చెరువు వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతూ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ సీతారామారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జట్టుకొండ మాట్లాడుతూ సద్దుల చెరువు వద్ద ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న (మహా ప్రస్థానం) శ్మశాన వాటికను అమృత్‌ పథకం కింద కేంద్రం పునర్నిర్మించిందన్నారు. గతంలో ఆరు ప్లాట్‌ఫాంలు ఉండగా ప్రస్తుతం మూడింటిని నిర్మించారని చెప్పారు. మున్సిపాలిటీ విస్తరిస్తున్నందున ఈ ప్లాట్‌ఫాంలు సరిపోవడం లేదన్నారు. అదేవిధంగా సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌ హన్మంతరెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ చలమల్ల నర్సింహ, రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవి చంద్ర, జుట్టుకొండ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌ శ్రీలక్ష్మీనరసింహస్వామికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల సంవాదం రక్తికట్టించారు. అనంతరం కల్యాణతంతు ముగించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు క్రిష్ణమాచార్యులు,పద్మనాభాచార్యులు , బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి ,ఆంజనేయా చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి
1
1/1

రికార్డు స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement