
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలి
కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలను మంగళవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడారు. శేష జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్‌రావు, వీరబాబు, జానయ్య, యజ్‌దాని, భ్రమరాంబ, భూపాల్‌రెడ్డి, హాజీనాయక్ పాల్గొన్నారు.