కట్ట మట్టి.. కొల్లగొట్టి! | - | Sakshi
Sakshi News home page

కట్ట మట్టి.. కొల్లగొట్టి!

Sep 17 2025 7:15 AM | Updated on Sep 17 2025 7:15 AM

కట్ట

కట్ట మట్టి.. కొల్లగొట్టి!

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం

తిరుమలగిరి (తుంగతుర్తి) : మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల వెంట అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. మూడు ట్రిప్పులు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా ఈ దందా సాగుతోంది. అయినా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తిరుమలగిరి మండలంలో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ, 69డీబీఎం, 70డీబీఎం, 71 డీబీఎం కాల్వలు ఉన్నాయి. ఆయా కాల్వల్లో తీసిన మట్టిని గతంలో వాటికి ఇరువైపులా పోశారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కాల్వల్లోకి వరద నీరు రాకుండా, కోతలకు గురి కాకుండా ఎత్తుగా ఉన్న ఈ మట్టి రక్షిస్తుంది. కాల్వల వెంట ఉన్న మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండానే కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారు. సాధారణంగా కొండలు, గుట్టల నుంచి మట్టిని తరలిస్తే మైనింగ్‌ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. చెరువులు, కాల్వల నుంచి అయితే ఇరిగేషన్‌ శాఖ అధికారుల పర్మిషన్‌ ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు.

హైవే రోడ్డుకు మట్టి తరలింపు

వలిగొండ–తొర్రూరు నేషనల్‌ హైవే నిర్మాణానికి ఎస్సారెస్పీ కాల్వల వెంట ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా వాడుతుస్తున్నారు. కాల్వల వెంట జేసీబీలు పెట్టి అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా రోడ్డుకు మట్టిని తరలించి చదును చేస్తున్నారు. కొంత మంది నాయకుల కనుసన్నల్లోనే అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మట్టి దందాతో రూ. లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. దీంతో పాటు లేఅవుట్లు చదును చేయడానికి, రోడ్లు వేయడానికి కూడా ఈ మట్టిని తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. గతంలో కూడ తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామంలోని ఎర్రబోడు గుట్ట వద్ద కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి అక్రమంగా మట్టిని తరలించారు.

ఇదే అదునుగా కాల్వల

వెంట భూముల ఆక్రమణ

కాల్వల వెంట ఉన్న మట్టిని పూర్తిగా తొలగించడంతో వీటికి ఇరువైపులా ఉన్న భూమిని పక్క భూమి వారు చదును చేసి కబ్జాచేస్తున్నారు. ఈ ఆక్రమించిన భూమిలో పంటలు సైతం వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కాల్వల వెంట మట్టిని తవ్వకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఎస్సారెస్పీ కాల్వల వెంట మట్టిని తీయడానికి ఎవరికీ పర్మిషన్‌ ఇవ్వలేదు. కాల్వల వెంట మట్టి తీసిన వారిపై, మట్టి తరలించిన టిప్పర్లపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.

– సత్యనారాయణ, ఇరిగేషన్‌ శాఖ డీఈ.

ఎస్సారెస్పీ కాల్వల వెంట అక్రమంగా మట్టి తవ్వకాలు

ఫ తిరుమలగిరి మండలంలో హైవేనిర్మాణం, వెంచర్ల ఏర్పాటు పనులకు తరలింపు

ఫ నాయకుల కనుసన్నల్లోనే దందా

ఫ చేతులు మారుతున్న లక్షల రూపాయలు

కట్ట మట్టి.. కొల్లగొట్టి!1
1/1

కట్ట మట్టి.. కొల్లగొట్టి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement