
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
సూర్యాపేటటౌన్ : ప్రజల భద్రతే పోలీస్‌శాఖ లక్ష్యమని ఎస్పీ కె. నరసింహ పేర్కొన్నారు. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ, ఆర్టీఏ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆటోకు క్యూఆర్ కోడ్ ఇవ్వడంతో పాటు400 మంది డ్రైవర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన ఆటో ప్రయాణానికి మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ఆటోలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీని అందించామన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కినట్లయితే క్యూఆర్ కోడ్ ప్రొవైడర్ ద్వారా సంబంధిత పోలీసులకు సమాచారం చేరి అలర్ట్ అయి మీకు రక్షణ కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్‌చార్జి ఆర్టీఏ జయప్రకాష్‌రెడ్డి, పట్టణ సీఐ వెంకటయ్య, మై ఆటో ఈజ్ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచాలి
నడిగూడెం : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి భానునాయక్ కోరారు. నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన క్రీడా వస్తువులను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు క్రీడా వస్తువులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఉత్తీర్ణతను 70 శాతంగా నిర్ణయించిందన్నారు.నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించేందుకు అధ్యాపకులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ డి.విజయనాయక్, అధ్యాపకులు ఉన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
సూర్యాపేటటౌన్ : తమకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనిసూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. ఐదు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరతూ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట మంగళవారం వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులేనని వారికి వెంటనే న్యాయం చేయాలన్నారు. 126 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్‌ఉద్యోగులు రామారావు, నర్సిరెడ్డి, నాగయ్య, సాగర్, విజయ్, సాయి, రమాకాంత్, క్రాంతి, సతీష్, అనిల్, నవీన్, సందీప్, జానకి రాములు, భరత్, వీరేష్ ,మధు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం

ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం