
సంపూర్ణ ఆరోగ్యం
సమతుల
ఆహారం..
నాగారం : అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా పోషకాహారం అందిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇంకా రక్తహీనత, పలు రకాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం, కేంద్రాలకు వచ్చే వారందరికీ పోషకాహారం అందించే లక్ష్యంతో గతేడాది వరకు సెప్టెంబరు మాసం మొత్తం పోషణ సంబరాలు నిర్వహించేవారు. అయితే ఈ సారి ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, వివిధ శాఖలను భాగస్వాములను చేయనున్నారు.
పర్యవేక్షణ చేపట్టాలి..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారికి రోజూ 75 గ్రాముల బియ్యం, 15 గ్రా. పప్పు, 0.5 గ్రా. ఆయిల్, గుడ్డు, 20 గ్రా. మురుకులు, 50 గ్రా. బాలామృతం అందజేస్తున్నారు. అయినా పోషకాహార లోపం ఉన్న చిన్నారులు, గర్భిణుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జిల్లాలో సుమారు 600 మందికి పైగా చిన్నారులు వారి వయసు కంటే తక్కువ ఎత్తు, బరువు ఉన్నారు. గర్భిణులను కూడా రక్తహీనత వెంటాడుతోంది. దీని కారణంగా సిజేరియన్ కాన్పులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చేపట్టబోయే కార్యక్రమాల ద్వారా మార్పు వచ్చేలా అవగాహన కల్పించాల్సి ఉంది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టాలి.
పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లాలో బుధవారం నుంచి నెల రోజుల పాటు నిర్వహిచనున్నాం. పోషణ మాసంలో భాగంగా పిల్లలకు, కిశోర బాలికలకు, మహిలకు పోషకాహారంపై అవగాహన కల్పించేలా కార్యచరణ రూపొందించాం. – దయానందరాణి,
జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి, సూర్యాపేట.
జిల్లా వివరాలు ఇలా...
మండలాలు 23
ప్రాజెక్టులు 05
అంగన్‌వాడీ కేంద్రాలు 1209
చిన్నారుల సంఖ్య 47,404
గర్భిణులు 5,947
బాలింతలు 3,888
ఫ నేటి నుంచి పోషణ మాసం
ఫ అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు
ఫ పోషణ ట్రాకర్‌లో వివరాల నమోదు

సంపూర్ణ ఆరోగ్యం