ప్రజాపాలన దినోత్సవానికి వేళాయే | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన దినోత్సవానికి వేళాయే

Sep 17 2025 7:15 AM | Updated on Sep 17 2025 7:15 AM

ప్రజాపాలన దినోత్సవానికి వేళాయే

ప్రజాపాలన దినోత్సవానికి వేళాయే

భానుపురి (సూర్యాపేట) : ఈనెల 17వ తేదీన ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతీయ గీతాలాపన, 10.05 గంటలకు మంత్రి ప్రసంగించనున్నారు. 10.30 గంటలకు బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 11గంటలకు ఈ కార్యక్రమం ముగియనుంది. ఇదిలా ఉండగా ఇక్కడ జరిగే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌ పాల్గొంటారని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం విదితమే. అయితే మారిన షెడ్యూల్‌ ప్రకారం ఉత్తమ్‌.. రంగారెడ్డి జిల్లాలో జరిగే వేడుకలకు హాజరుకానున్నారు.

ఫ నేడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement