
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
సూర్యాపేట : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు కోరారు. ఈనెల 7వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అఖిల భారత పదవ జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం సూర్యాపేటలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దివ్య, కవిత, నవ్య, అలేఖ్య, సురేష్, నరేష్, సందీప్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.