ఇళ్ల నమూనాలు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నమూనాలు ముమ్మరం

Aug 5 2025 10:56 AM | Updated on Aug 5 2025 10:56 AM

ఇళ్ల నమూనాలు ముమ్మరం

ఇళ్ల నమూనాలు ముమ్మరం

ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం

జిల్లాలో 19 ఇందిరమ్మ ఇంటి నమూనాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ఇప్పటికే 15 నమూనాలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని ఈనెల 15లోగా పూర్తిచేసేలా పనులు చేస్తున్నాం. లబ్ధిదారులు ఈ ఇంటి నమూనాలను అనుసరించి నిర్మాణాలు చేసుకోవాలి.

– సిద్ధార్థ, హౌసింగ్‌ పీడీ

భానుపురి (సూర్యాపేట) : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రానికి ఓ నమూనాను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు ఇంటి నమూనాపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు జిల్లాలో చకచకా పూర్తవుతున్నాయి. 14 నమూనా నిర్మాణాలు పూర్తవగా మరో ఐదు నమూనాలు వివిధ దశలో ఉన్నాయి. పంద్రాగస్టు నాటికి అన్నింటినీ పూర్తిచేసేందుకు గృహ నిర్మాణ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోంది.

19 మండలాల్లో నిర్మాణాలు..

సూర్యాపేట జిల్లాలోని 19 మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇంటి నమూనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయాలు, రైతు వేదికలు, ఇలా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 14 మండలాల్లో ఇంటి నమూనాలు పూర్తయ్యాయి. మరో అయిదు చోట్ల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. స్థలం కొరత కారణంగా జిల్లాలోని ఆత్మకూర్‌ ఎస్‌, నాగారం, మద్దిరాల, చింతలపాలెం మండలాల్లో ఆలస్యంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్మాణాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అవగాహన కల్పించేందుకు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రాయితీతో రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. సొంత స్థలం ఉండి డబ్బులు లేక ఇంటి నిర్మాణం చేసుకోలేని వారికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో తక్కువ వ్యయంతో ఇంటి నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చో ప్రభుత్వమే వాటి వివరాలను, గణాంకాలతో ప్రకటించింది. 400 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణం లోపు నిర్మాణం పూర్తిచేసే నమూనా రూపొందించింది. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా లబ్ధిదారుడు వచ్చి చూసి ఇంటి నిర్మాణాలు చేపట్టేలా వీటిని ప్రారంభించారు. దాదాపు జిల్లాలో మంజూరైన 19 నిర్మాణాలకు 14 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. లబ్ధిదారులు ఈ ఇంటి నిర్మాణాలను చూసి తాము ఇళ్లను నిర్మించుకోనున్నారు.

జిల్లాలో 19 ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు

లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా నిర్మిస్తున్న గృహనిర్మాణశాఖ

ఇప్పటికే 14 నమూనాలు పూర్తి

15వతేదీ నాటికి మిగతావి పూర్తిచేసేలా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement