
కొత్త కారు్డలకూ పథకాలు
భానుపురి(సూర్యాపేట) : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అందనున్నాయి. గృహ జ్యోతి, మహాలక్ష్మితో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నూతనంగా రేషన్ కార్డులు పొందిన 24వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
24వేలకు పైగా మందికి లబ్ధి..
పదేళ్లుగా రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో వేలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను దూరమయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా మొదటగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో పదేళ్లుగా రేషన్ కార్డులు లేకపోవడంతో నూతనంగా వివాహాలు చేసుకున్న వేలాది మందికి ఈ పథకాలు అందలేదు. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటికి రేషన్ కార్డులు కావాల్సి ఉంది. గత నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందిన దాదాపు 24వేలకు పైగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందించారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు వీరందరికీ అందనున్నాయి.
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు
దరఖాస్తు చేసుకునే అవకాశం
కలెక్టరేట్, ఎంపీడీఓ, మున్సిపల్
కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు
నూతనంగా 24వేల కుటుంబాలకు ప్రయోజనం
గృహజ్యోతి
లబ్ధిదారులు
1,80,607
ఇప్పటి వరకు
ఉన్న రేషన్ కార్డులు
3,26,057
నూతన
రేషన్ కార్డులు
24,082
మహాలక్ష్మి లబ్ధిదారులు
1,62,718

కొత్త కారు్డలకూ పథకాలు