
కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షణకు ఏర్పాట
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఉదయం 12గంటలకు తెలంగాణ భవన్‌నుంచి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రత్యేక స్క్రీన్ ల ద్వారా వీక్షించడానికి సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రె డ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డిలు హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
గరిడేపల్లి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. బాల సైదిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు బి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కిషోర్‌బాబు, వీరస్వామి పాల్గొన్నారు.
గొల్లకురుమల సమస్యలు పరిష్కరించాలి
తుంగతుర్తి : గొల్లకురుమల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత గొర్రెల పంపిణీ కింద నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినేటికీ నెరవేర్చలేదన్నారు. యాదవ విద్యార్థులందరికీ వెటర్నరీ పోస్టులు కేటాయించి, 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలన్నారు. సమావేశంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు వీరబోయిన రాములు, కొమ్మ లింగయ్య, ఉప్పుల లింగయ్య, మట్టిపెల్లి శ్రీను, నర్సయ్య, గంగరాజు, మధు, వెంకన్న, భిక్షం, శ్రీశైలం, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షణకు ఏర్పాట