
సెల్‌ఫోన్ల రికవరీలో సిబ్బంది కృషి ప్రశంసనీయం
సూర్యాపేటటౌన్ : పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో పోలీస్ సిబ్బంది కృషి ప్రశంసనీయమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. వివిధ చోట్ల పోగొట్టుకున్న 101 సెల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేసి మాట్లాడారు. పోయిన ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి కూడా రికవరీ చేశామన్నారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే అందులో ఉన్న విలువైన సమాచారం పోతుందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకిగురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి అండగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్పీ నరసింహ