ఎరువు మరింత భారం ! | - | Sakshi
Sakshi News home page

ఎరువు మరింత భారం !

Jul 25 2025 4:20 AM | Updated on Jul 25 2025 4:20 AM

ఎరువు

ఎరువు మరింత భారం !

నాగారం : వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడులు తగ్గడం.. పండించిన పంటలకు మార్కెట్‌లో సరైన ధర లేక నష్టాలను చవిచూస్తున్న రైతులకు పెరిగిన ఎరువుల ధర మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాస్పరస్‌, పొటాష్‌ ధరల పెరుగుదలతో కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను ఈ ఏడాది పెంచేశాయి. రకాన్ని బట్టి బస్తాకు గరిష్ఠంగా రూ.150 వరకు పెరగడంతో జిల్లాలోని రైతులపై రూ.కోట్లల్లో అదనపు భారం పడుతుంది.

6.17 ఎకరాల్లో సాగు భూమి

జిల్లాలో 6.17లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వరి 4,85,125 ఎకరాలు, పత్తి 91వేల ఎకరాలు , కంది 2,650 ఎకరాలు, పెసర 2,700 ఎకరాలు, వేరుశనగ 400 ఎకరాలు, మొక్కజొన్న 45 ఎకరాలు, మిర్చి 15,150 ఎకరాలు, చెరకు 60 ఎకరాలు, ఆయిల్‌పాం 4,000 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాలు, పండ్లు, కూరగాయలు 16,200 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచానా వేశారు. జిల్లా రైతులు డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను అధికంగా వినియోగిస్తుంటారు. యూరియాపైనే కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉంది. కాంప్లెక్స్‌ ఎరువుల విషయంలో రాయితీ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చు ఆధారంగా ధరలు నిర్ణయించే అకాశం ఉంది. యూరియా బస్తా(45 కిలోలు) తయారీకి రూ.1614 ఖర్చు కాగా, కేంద్రం బస్తాకు రూ.1347. 50 రాయితీ భరించి రైతులకు రూ.266.50కు అందిస్తోంది. కాంప్లెక్స్‌ ఎరువుల తయారీలో పొటాష్‌, పాస్పరస్‌ వంటి దేశీయంగా లభించక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో బస్తాకు రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగాయి. దీంతో వాన కాలం, యాసంగి సీజన్‌లలో ఈ మొత్తం రూ.13.64 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడనుంది.

సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి

రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియా ఎరువులు వినియోగిస్తే అధిక పంటల దిగుబడుతో పాటు పంట పెట్టుబడి తగ్గుతుంది. యూరియా, డీఏపీకి బదులు నానో ఎరువు వాడితే ఖర్చు తక్కువ...లాభం ఎక్కువగా ఉంటుంది.

– జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా

వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట.

ఫ పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

ఫ రైతులపై ఆర్థిక భారం

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఇలా...(రూ.లలో)

ఎరువు 2023 2024 2025

20:20:13 1175 1300 1350

14:35:14 1450 1650 1800

10:26:26 1470 1570 1720

ఎరువు మరింత భారం !1
1/1

ఎరువు మరింత భారం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement