
ద్విచక్ర వాహనం ఢీకొని..
కనగల్: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ స్టేజీ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన షేక్ యాసిన్(75), హలీమా దంపతులు 20ఏళ్ల కిందట కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి వలస వచ్చి గ్రామ స్టేజీ వద్ద మిఠాయి దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం యాసిన్ తన దుకాణం అవతలి వైపు రోడ్డు దాటుతుండగా.. నల్ల గొండ మండలం బుద్దారం గ్రామానికి చిలుకల అనిల్ ద్విచక్ర వాహనంపై వచ్చి యాసిన్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాసిన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రషీద్‌ఖాన్ తెలిపారు.