
కాంగ్రెస్ రూపొందించింది ముస్లిం రిజర్వేషన్ బిల్లు
చౌటుప్పల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదని, అది పూర్తిగా ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల పేరుతో కేవలం ఒక మతానికి రిజర్వేషన్లు తీసుకురావడానికి బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. 285 సెక్షన్ సవరణ చేసి పంపించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుండానే గవర్నర్‌కు పంపించిందని ఆరోపించారు. 42శాతం రిజర్వేషన్‌లో 10శాతం ముస్లింలకే దక్కతుందన్నారు. నిజమైన బీసీలకు కాకుండా మతానికి రిజర్వేషన్లు అందించే కాంగ్రెస్ పన్నాగాన్ని బీసీ సమాజం గుర్తించాలన్నారు. కాంగ్రెస్ కుట్రను బయటపెడుతున్న బీజేపీని కావాలని బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చేది, ఇస్తున్నది కేవలం బీజేపీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా నిలువవని తెలిసే కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మండల, మున్సిపల్ కమిటీల అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, మాజీ సర్పంచ్‌లు రమనగోని దీపిక, రిక్కల సుధాకర్‌రెడ్డి, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, పోలోజు శ్రీధర్‌బాబు, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, చినుకని మల్లేశం, బత్తుల జంగయ్య, మన్నె ప్రతాపరెడ్డి, ఊడుగు వెంకటేశం, కట్ట కృష్ణ, పిల్ల బుచ్చయ్య, కడారి అయిలయ్య తదితరులు ఉన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప