ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం
హుజూర్‌నగర్‌రూరల్ : హుజూర్‌నగర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. వేపలసింగారంలో కొనుగోలు కేంద్రంలో రైతులు చల్మారెడ్డి, యూకుబ్‌లకు చెందిన సుమారు 10 ఎకరాల ధాన్యం తడవడంతో పాటు రాశులపై కప్పిన పట్టాలపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ నీటిని తొలగించి బుధవారం వాటిని ఆరబెట్టారు. అంతేకాకుండా బూరుగడ్డ, శ్రీనివాసపురం, లక్కవరం, అమరవరం గ్రామాల్లో కోతకు దశకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఆకాల వర్షానికి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతు సంఘాల నాయకులు కోరారు.
తోటల్లో రాలిన మామిడి, నిమ్మ కాయలు
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మండలంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మతోటలకు నష్టం వాటిల్లింది. జలాల్‌పురం, తొండ గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు, నిమ్మకాయలు రాలాయి.
ఫ అకాల వర్షానికి తడిసిన ధాన్యం
ఫ నేలవాలిన వరి చేలు
ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం
ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం
ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం


