కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ
కోదాడరూరల్: కోదాడ బార్‌అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు న్యాయవాదులు పోటీపడుతున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం పలు పదవులు ఏకగ్రీవం కాగా కొన్ని పదవులకు పోటీ తప్పలేదు. అధ్యక్ష పదవికి సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్య పోటీలో ఉండగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎండి.హుస్సేన్, ఎస్. నవీన్‌కుమార్‌లు పోటీపడుతున్నారు. కాగా వైస్ ప్రెసిడెంట్‌గా ఉయ్యాల నర్సయ్య, జాయింట్ సెక్రటరీగా ఎండి.నయీం, లైబ్రరీ సెక్రటరీగా షేక్.కరీముల్లా, ట్రెజరర్‌గా కోడూ రు వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్‌సెక్రటరీగా బండారు రమేష్‌బాబు, లేడీ రిప్రజెంటేటివ్‌గా ధనలక్ష్మితో పాటు ఈసీ మెంబర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
చివ్వెం(సూర్యాపేట) : విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని విజయకాలనీలో ఉన్న బాల సదన్ చిల్ట్రన్స్ హోమ్‌ను తనిఖి చేశారు. విద్యార్థులను మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమ శిక్షణ పట్టుదలతో చదివి, భావిపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, బి.విష్ణు స్వ రూప్ పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు
దూరంగా ఉండాలి
కోదాడరూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నరసింహ సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చిన్నవయస్సులోనే గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తుండాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కొంతమంది స్వార్థంతో దాడులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, రూరల్ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్‌ఐ ఎం.అనిల్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ


