బైక్‌పై డొంకదారిలో వెళ్లి.. ఉపాధి పనులు పరిశీలించి.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై డొంకదారిలో వెళ్లి.. ఉపాధి పనులు పరిశీలించి..

Mar 6 2025 2:00 AM | Updated on Mar 6 2025 1:56 AM

నూతనకల్‌: నూతనకల్‌ మండలం కేంద్రంలో ఉపాధి పథకం కింద రైతుల పంటపొలాలకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను పరిశీలించేందుకు బుధవారం సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ బైక్‌పై వెనుక కూర్చొని రెండు కిలోమీటర్ల మేర డొంకదారిలో వెళ్లారు. అక్కడ కూలీలతో మాట్లాడారు. రోజూ పని కల్పిస్తున్నారా.. చేసిన పనికి వేతనం సమయానికి చెల్లిస్తున్నారా.. తాగడానికి మంచినీరు.. అలసట తీర్చుకోవడానికి తగిన ఏర్పాటు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి వేసవిలో వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేసి సమయానుకూలంగా నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధతో చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, ఎంఈఓ రాములు నాయక్‌, ఏపీఓ శ్రీరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ నూతనకల్‌లో కూలీలతో

మాట్లాడిన కలెక్టర్‌

ఫ పనులు, వసతుల కల్పనపై ఆరా

బైక్‌పై డొంకదారిలో వెళ్లి.. ఉపాధి పనులు పరిశీలించి.. 1
1/1

బైక్‌పై డొంకదారిలో వెళ్లి.. ఉపాధి పనులు పరిశీలించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement