పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు : కలెక్టర్‌

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

సహాయ కలెక్టర్‌(శిక్షణ)గా హరిఓం పాండియా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 713 కిలోలీటర్ల పెట్రోల్‌, 734 కిలోలీటర్ల డీజిల్‌ అందుబాటులో ఉన్నాయని, ఇది మరో 4 రోజులకు పైగా సరిపోతుందన్నారు. సోమవారం కూడా అదనంగా 230 కిలోలీటర్ల డీజిల్‌ జిల్లాకు చేరుకుందన్నారు. అపోహల కారణంగా సగటు విక్రయాల కంటే సోమ వారం ఒక్కరోజే 165 కిలోలీటర్ల పెట్రోల్‌, 210 కిలోలీటర్ల డీజిల్‌ అదనంగా విక్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతులకు 50 లీటర్ల వరకు ఇబ్బంది లేకుండా ఇస్తామని, అయితే బల్క్‌ విక్రయాల పేరిట 300 లీటర్ల కంటే ఎక్కువ ఒకేసారి ఇచ్చే అవకాశం లేదన్నారు.

‘ఇంధనంపై వదంతులు నమ్మవద్దు’

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. బంక్‌ నిర్వాహకులు పారదర్శకంగా క్రమబద్ధంగా విక్రయాలు నిర్వహించి వినియోదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా ఉద్ధేశ్యపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, అక్రమ నిల్వలు సృష్టించినా, నల్లబజారులో విక్రయాలకు పాల్పడినా లేదా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలకు సృష్టించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్లల్లో నిల్వ చేయడం ప్రమాదకరమని సూచించారు.

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ సేవ సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. వైశాఖమాసం శుద్ధ ఏకాదశి పర్వదినాన శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ ఆదిత్యుని కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో ప్రత్యేక ఆసనంపై ఉంచి కల్యాణాన్ని ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ ఈ కల్యాణాన్ని జరిపించగా, ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లోకి కొత్త సుజుకీ బర్గ్‌మన్‌

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం పరిధిలోని పెదపాడు రోడ్డులో గల శ్రీ జయలక్ష్మీ మోటార్స్‌ ఎల్‌ఎల్‌పి నుంచి మరో కొత్త వాహనం సుజుకీ బర్గ్‌మన్‌ ప్రారంభించినట్లు షోరూం ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనం ఆధునిక కలర్‌తో పాటు కీ అవ సరం లేకుండా పనిచేసే కీ లెస్‌ సిస్టమ్‌తో పాటు డిజిటల్‌ డిస్‌ప్లేతో వస్తుందన్నారు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారుడుకి మరింత ఆకర్షణగా ఉంటుందని పేర్కొన్నారు. టెస్ట్‌ డ్రైవ్‌ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా సహాయ కలెక్టర్‌ (శిక్షణ)గా 2025 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి హరిఓం పాండియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన, అ నంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన హరిఓం పాండియా విద్యార్థి దశ నుంచే ప్రతిభ కనబరిచారు. బి.ఎ. ఎల్‌.ఎల్‌.బి పూర్తి చేసిన ఆయన, కేవలం 23 ఏళ్ల వయసులోనే తన తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 160వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. జిల్లా శిక్షణలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని భౌగోళిక పరిస్థితు లు, ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి పాలనాపరమైన అంశాలపై అవగాహన పెంచుకోనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement