నరసన్నపేట: అనతి కాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారానికి ఎరువుల రిటైల్, హోల్‌సేల్ షాపుల యజమానులు సోమవారం ఒక రోజు బంద్ పాటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎరువులు, పురుగు మందుల షాపులు మూత పడ్డాయి. ఈ సందర్భంగా నరసన్నపేటలో ఎరువుల డీలర్లు యూనియన్ ప్రతినిధులు ఊణ్ణ అనిల్, కామేశ్వరరావు, శ్రీధర్‌లు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ మేరకు ఒక రోజు సమ్మెలో పాల్గొన్నామన్నారు. కంపెనీలు డీలర్లకు ఎరువులు సరఫరా చేసే సమయంలో రవాణా చార్జీలు ఇవ్వాలని, కమిషన్ మార్జిన్ పెంచాలని, లింక్ ప్రొడక్టు అంటగట్టకూడదని అన్నారు.


