శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Feb 15 2026 6:46 AM | Updated on Feb 15 2026 6:46 AM

శ్రీక

శ్రీకాకుళం

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ●విద్యకు కేటాయింపులు తక్కువ.. ●క్రీడలకు నిధులు పెంచాలి ●యువతకు మోసం ●విద్యారంగానికి నిరాశ ●కాకి లెక్కలు ●50 ఏళ్లకు పింఛన్‌ ఊసు లేదు సంక్షేమంలో కోతలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అత్తెసరు నిధులు చదువుపై నిర్లక్ష్యం ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడ ఉద్యోగులకు మొండిచేయి ●ఉద్యోగుల సంక్షేమం ఏదీ..? ●జిల్లాకు అన్యాయం ●దళిత, ఆదివాసీల అభివృద్ధికి తూట్లు ●ఉద్యోగులకు రిక్తహస్తం

పబ్లిక్‌ టాక్‌

2026–27 బడ్జెట్‌లో అంకెల గారడీ

గతంలో కేటాయించిన నిధులు.. అస్సలు ఇవ్వని వైనం

తాజా కేటాయింపులపై కొరవడిన స్పష్టత

ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అరకొర నిధులు

జిల్లాలోని కీలక ప్రాజెక్టులకు మొండి చేయి

విద్యా సంస్థలపై శీతకన్ను

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

మహేంద్ర తనయ ప్రాజెక్టు

2024–25లో చంద్రబాబు ప్రభుత్వం

కేటాయించిన బడ్జెట్‌ : రూ.37.71 కోట్లు

విడుదల చేసిన బిల్లు : రూ.20.34 కోట్లు

2025–26లో చంద్రబాబు ప్రభుత్వం

కేటాయించిన బడ్జెట్‌ : రూ.90.60 కోట్లు

విడుదల చేసిన బిల్లు : రూ.10.82 కోట్లు

పెండింగ్‌లో ఉన్న బిల్లులు : రూ.11.01 కోట్లు

2026–27లో ప్రతిపాదించిన బడ్జెట్‌ : రూ. 283 కోట్లు

కేటాయించిన బడ్జెట్‌ : రూ.90.60 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు చాలా తక్కువ. కొఠారీ కమిషన్‌ రాష్ట్ర బడ్జెట్‌లో 30 శా తం విద్యారంగానికి కేటాయించాలని సూచించింది. కనీసం 20 శాతమైనా ఇవ్వలేదు.

– తమ్మినేని చందనరావు, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఏపీ, రాష్ట్రప్రధాన కార్యదర్శి

స్టేడియంతోపాటు మినీ స్టేడియాలు, క్రీడాకారులకు సదుపాయాలు, వసతులు, క్రీడాసంఘాలకు చేయూత, క్రీడాపోటీలకు నిధులు కేటాయింపునకు సంబంధించి బడ్జెట్‌లో ఎప్పడూ కేటాయింపులు జరగడంలేదు. ప్రభుత్వం క్రీడలకు నిధులు పెంచేలా చొరవ తీసుకోవాలి.

– ఎం.సాంబమూర్తి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇస్తామన్న మాట ఏమైంది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ యువతకు చేస్తున్న మోసంపై పోరాటాలు చేస్తాం.

– కొన్న శ్రీనివాసరావు,

ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి

బడ్జెట్‌ నిరాశ కలిగించింది. నాడు–నేడు పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించలేదు. రెండేళ్లుగా ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఉద్యో గ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్‌సీ, ఐఆర్‌, పెండింగ్‌ డీఏల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అవసరం మేరకు నిధులు కేటాయించలేదు.

– బమ్మిడి శ్రీరామమూర్తి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, నరసన్నపేట

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం కాకి లెక్కలతో ఉత్తరాంధ్రకు మోసం చేశారు. జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించలేదు. జిల్లాలో వంశధార నుంచి ఆఫ్‌షోర్‌ వరకు, బీఆర్‌ఏయూ నుంచి ట్రిపుల్‌ ఐటీ వరకు, ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి కిడ్నీ ఆస్పత్రి వరకు జిల్లా ప్రగతికి అవకాశాలు ఎన్నో ఉన్నా.. వేటినీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

– సింగుపురం మోహన్‌రావు,

న్యాయవాది, టెక్కలి.

సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ మేరకు నిధులివ్వలేదు. ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి పథకాల ఊసే లేదు. ఇది బాబు మోసపూరిత బడ్జెట్‌. ఆర్‌ఎస్‌కేల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు తగిన ప్రాధాన్యత నివ్వలేదు. ధరల స్థిరీకరణకు కేవలం రూ. 500 కోట్లే కేటాయించారు.

– ఆరంగి మురళి, వైఎస్సార్‌సీపీ కాళింగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

2025–26లో కుడి కాలువ మెయింటెనెన్స్‌

బడ్జెట్‌ ప్రతిపాదనలు : రూ. కోటి

కేటాయింపులు : రూ. 25 లక్షలు

విడుదల చేసిన నిధులు : 0

2026–27లో ప్రతిపాదిత బడ్జెట్‌ : రూ. 2 కోట్లు

కేటాయింపులు : 0

చంద్రబాబు సర్కారు చెప్పే అంకెలు.. ముడిపెట్టే లంకెలు మరోసారి తేటతెల్లమయ్యాయి. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్‌లో ఓ సంఖ్య చెప్పడం.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి అందులో సగం కూడా ఇవ్వకపోవడం బాబు సర్కారుకు రివాజు. గత కేటాయింపులే అందుకు నిదర్శనాలు. తాజా బడ్జెట్‌లోనూ జిల్లా ప్రాజెక్టులకు వెక్కిరింతే ఎదురైంది. కావాల్సింది కొండంత.. కేటాయించేది గోరంత.. ఇచ్చేది రవ్వంత అన్నట్టు మారింది సర్కారు వైఖరి. వంశధార నుంచి ఆఫ్‌షోర్‌ వరకు, బీఆర్‌ఏయూ నుంచి ట్రిపుల్‌ ఐటీ వరకు, ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి కిడ్నీ ఆస్పత్రి వరకు జిల్లా ప్రగతికి అవకాశాలు ఎన్నో ఉన్నా.. వేటినీ పట్టించుకోకుండా, ‘వెనుకబాటు’ ముద్ర చెరిపే ప్రయత్నం చేయకుండా పద్దు పాట పాడారు.

ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ 2025–26 బడ్జెట్‌

కేటాయింపులు : సుమారు రూ. 20 కోట్లు

వచ్చిన నిధులు : స్పష్టత లేదు

2026–27లో నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు

బడ్జెట్‌ కేటాయింపులు : రూ. 102.45 కోట్లు

జిల్లాలో జరిగే అభివృద్ధి పనులకే కాదు సంక్షేమ కార్యక్రమాలకు అరకొరగానే నిధులు కేటాయింపులు చేసింది. తల్లికి వందనం, మత్స్యకార భరోసా, రైతు భరోసా, సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్ల పథకం తదితర పథకాలకు అత్తెసరు నిధులు కేటాయించింది. నిరుద్యోగ భృతి తదితర హామీలను గాలికొదిలేసింది. వృద్ధులు, వితంతువులకు కొత్త పింఛన్లు, 50ఏళ్ల దాటిన మహిళలకు ఫించన్‌ హామీ నెరవెర్చే పరిస్థితి లేదు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కొత్తవాటికి మొండి చేయి.. పాతవాటికి టాటా బైబై.. ఇదీ చంద్రబాబు సర్కారు తాజా బడ్జెట్‌ స్వరూపం. ముచ్చటగా మూడో బడ్జెట్‌లో కూడా జిల్లాకు మొండి చేయి చూపారు. గత ఏడాది బడ్జెట్‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల్లో ఒకటో వంతు కూడా విడుదల చేయకుండా ఇప్పుడు మళ్లీ అంకెల గారడీ చేసి చూపించడం సిక్కోలు వాసులను విస్మయపరుస్తోంది.

వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2, మహేంద్ర తనయ ఆష్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. వంశధార స్టేజ్‌–2లోని ఫేజ్‌–2పనులకు రూ.182.52కోట్లు కేటాయించగా కేవలం రూ.46.23 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసింది. ఇందులోనూ రూ.37.62 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. 2026–27కు సంబంధించి రూ.368.28 కోట్లు కావాల్సి ఉండగా, రూ.182.14 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ డబ్బులు వస్తాయో రావో వారికే ఎరుక. ఆఫ్‌షోర్‌ విషయంలోనూ అంతే గతంలో రూ.90కోట్ల పైచిలుకు ప్రకటించి రూ.10 కోట్లు ఇచ్చారు. ఇక్కడ కూడా రూ.11 కోట్లపైచిలుకు బకాయిలు ఉన్నాయి. ఈ సారి కూడా రూ.90 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎంత వస్తున్నదన్నది ప్రశ్నార్థకమే. వంశధార స్టేజ్‌–1 పనులకై తే అతీగతి లేకుండా పోయింది. నదుల అనుసంధానం, కరకట్టల పనులపై స్పష్టతే లేదు.

అంబేడ్కర్‌ యూనివర్సిటీకి, ట్రిపుల్‌ ఐటీకి అరకొర నిధులు కేటాయించారు. దీంతో వాటి పరిధిలో జరుగుతున్న నిర్మాణాల ప్రగతి ముందుకు సాగే పరిస్థితి లేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌, వెటర్నరీ పాలిటెక్నిక్‌, హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లకు కూడా ఈ బడ్జెట్‌లో నిధుల ప్రస్తావన లేదు.

జిల్లాలో నిర్మాణంలో ఉన్న బుడగట్ల పాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు నిధులు కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. నువ్వల రేవు, మంచినీళ్లపేట జెట్టీని హార్బర్‌గా మార్చాలన్న దానిపై క్లారిటీ లేదు. రోడ్ల నిర్మాణాలకు, గృహ నిర్మాణాలకు నిధులు కూడా అరకొరగానే ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రి, డయాలసిస్‌ సెంటర్లపై కూడా శీతకన్ను వేసింది. కిడ్నీ రోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌పై క్లారిటీ ఇవ్వలేదు. కేటాయింపుల్లో స్పష్టత లేదు. పీఆర్‌సీ చైర్మన్‌ నియామకం జోలికే పోలేదు. ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 5వ డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.

బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమం కనిపించలే దు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.30 వేల కోట్ల బకా యిల ప్రస్తావన లేదు. పీఆర్సీ, ఐఆర్‌ గురించి చెప్పలేదు.

– గురుగుబెల్లి భాస్కరరావు,

ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు

బడ్జెట్‌తో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టుకు, ఫేజ్‌– 2, స్టేజ్‌–2, హిరమండలం లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ వంటి ప్రాజెక్టులకు కేటాయింపులు లేకపోవడం అన్యాయం. వెటర్నరీ కాలేజీతో పాటు మెడికల్‌ కాలేజీలకు బడ్జెట్‌ ఇవ్వలేదు. – దుంపల లక్ష్మణరావు,

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధు లు కేటాయించకుండా దళి త ఆదివాసీ జీవితాలను బుగ్గిపాలు చేసిన బడ్జెట్‌ ఇది. అంబేడ్కర్‌ విదేశీయ విద్యకు బడ్జెట్‌లో కేటా యింపులు లేకపోవడం దారుణం.

– డి.గణేష్‌, దళిత,

ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్‌

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఉద్యోగులకు ఒరిగింది శూన్యం. పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, సీపీఎస్‌ ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14% చేయాలనే డిమాండ్‌ ఉన్నప్పటికి, ఆ దిశగా ఎటువంటి ప్రకటన లేదు. – హనుమంతు సాయిరాం,

ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు

వంశధార స్టేజ్‌–1 పనులు

2024–25లో చంద్రబాబు ప్రభుత్వం

కేటాయించిన బడ్జెట్‌ : రూ. కోటి

విడుదల చేసిన బిల్లు : 0

2025–26లో బడ్జెట్‌ ప్రతిపాదనలు : రూ. 20కోట్లు

బడ్జెట్‌లో కేటాయింపులు : 0

2025–26లో ఎడమ కాలువ మెయింటెనెన్స్‌

బడ్జెట్‌ ప్రతిపాదనలు : రూ. 2.03కోట్లు

కేటాయింపులు : రూ. వెయ్యి

విడుదల చేసిన నిధులు : సున్నా

2026–27లో ప్రతిపాదిత బడ్జెట్‌ : 3.02కోట్లు

కేటాయింపులు : సున్నా

వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులు

(87, 88 ప్యాకేజీ, రిజర్వాయర్‌, హైలెవెల్‌ కెనాల్‌,లిఫ్ట్‌)

2024–25లో చంద్రబాబు ప్రభుత్వం

కేటాయించిన బడ్జెట్‌ : రూ. 63.50 కోట్లు

విడుదల చేసిన బిల్లు : రూ.కోటి

2025–26లో కేటాయించిన బడ్జెట్‌ : రూ. 182.52 కోట్లు

విడుదల చేసిన బిల్లు : రూ. 46.23 కోట్లు

పెండింగ్‌లో ఉన్న బిల్లులు : రూ. 37.62 కోట్లు

2026–2027లో కావాల్సిన బడ్జెట్‌ : రూ. 368.28 కోట్లు

కేటాయించిన బడ్జెట్‌ రూ. 182.14 కోట్లు

బీఆర్‌ఏయూకు 2024–25లో

బడ్జెట్‌ కేటాయింపులు : రూ. 8కోట్లు

విడుదల చేసిన నిధులు : రూ. 7కోట్లు

2025–26 బడ్జెట్‌ కేటాయింపులు : రూ. 8.50కోట్లు

విడుదల చేసిన నిధులపై స్పష్టత లేదు

2026–27 బడ్జెట్‌ కేటాయింపులు : రూ. 8.50కోట్లు

శ్రీకాకుళం1
1/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం8
8/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం9
9/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం10
10/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం11
11/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం12
12/13

శ్రీకాకుళం

శ్రీకాకుళం13
13/13

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement