●బాబు మార్కు వంచన | - | Sakshi
Sakshi News home page

●బాబు మార్కు వంచన

Feb 15 2026 6:46 AM | Updated on Feb 15 2026 6:46 AM

●బాబు

●బాబు మార్కు వంచన

●బాబు మార్కు వంచన ●ప్రగతికి అడ్డంకులే.. ●అరకొర కేటాయింపులు ●అంకెల గారడీ ●ప్రజలకు ఒరిగేదేమీ లేదు ●అవాస్తవ బడ్జెట్‌

బడ్జెట్‌ అంతా బాబు మా ర్కు వంచనే. పేదలు, రైతులు, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసే బడ్జెట్‌ ఇది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కనీసం వాటి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణం. అన్నదాత సుఖీభవకు అరకొరగా నిధులు కేటాయించారు. ఉత్తరాంధ్రకు మొండిచేయి చూపించారు. పారిశ్రామికంగా, విద్యాపరంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు బడ్జెట్‌లో ఎలాటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు.

– ధర్మాన కృష్ణదాస్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అన్నదాత సుఖీభవకు అరకొర నిధులు కేటాయించారు. తల్లికి వందనం కూడా అంతే. పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గించారు. జిల్లా ప్రగతి లో ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుల్లేవు. రెండేళ్లు అవుతున్నా వాటి ప్రగతి లేకుండా పోయింది. వంశధార ఆధునికీకరణ పనులకు మొండిచేయి చూపారు. హార్బర్‌ ప్రస్తావన లేదు. నువ్వుల రేవు, మంచినీళ్లపేట జెట్టీని హార్బర్‌గా మార్పుకు సంబంధించి నిధులు కేటాయించలేదు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీకి బడ్జెట్‌లో కేటాయించకుండా నిరాశ పరిచింది. ప్రతి మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని మోసం చేసింది. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. అన్నదాతలకు అరకొర నిధులు కేటాయింపుతో మోసం చేశారు.

– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం

చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అంకెల గారడితో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశారో...ఇ ప్పుడు బడ్జెట్‌ పేరుతో అదే మోసం చేశారు. జిల్లా అభివృద్ధికి మొండి చేయి చూపారు. 50 ఏళ్లకు పింఛన్‌ ఇస్తామనే హామీ ఊసే లేదు.

– పేరాడ తిలక్‌, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి.

తాజా బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు ప్రతి నెల రూ.1500 లు ఇస్తామన్నారు. ప్రస్తుతం దానికి బడ్జెట్‌ కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి, 50 ఏళ్లు దాటిన వారి పెన్షన్‌కు నిధులు ఇవ్వలేదు.

– చింతాడ రవికుమార్‌, వైఎస్సార్‌సీపీ

ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త

రూ.3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్‌ ఏపీ చరిత్రలో అవాస్తవ బడ్జెట్‌గా నిలిచిపోతుంది. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. పీఆర్పీ, ఐఆర్‌పై ఎలాంటి కేటాయింపులు లేవు. సీపీఎస్‌ రద్దుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

– సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ

నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం

●బాబు మార్కు వంచన 
1
1/5

●బాబు మార్కు వంచన

●బాబు మార్కు వంచన 
2
2/5

●బాబు మార్కు వంచన

●బాబు మార్కు వంచన 
3
3/5

●బాబు మార్కు వంచన

●బాబు మార్కు వంచన 
4
4/5

●బాబు మార్కు వంచన

●బాబు మార్కు వంచన 
5
5/5

●బాబు మార్కు వంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement