●మల్లన్నకు పొందూరు తలపాగా | - | Sakshi
Sakshi News home page

●మల్లన్నకు పొందూరు తలపాగా

Feb 15 2026 6:46 AM | Updated on Feb 15 2026 6:46 AM

●మల్లన్నకు పొందూరు తలపాగా

●మల్లన్నకు పొందూరు తలపాగా

●మల్లన్నకు పొందూరు తలపాగా

పొందూరు: శివరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామికి తలపాగా, ఇతర వస్త్రాలు పొందూరు నుంచి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది పొందూరు చేనేత వాడకు చెందిన బల్ల బద్రయ్య తీసుకుని వెళ్లారు. ఆదివారం శివరాత్రి రోజున రాత్రి ఈ వస్త్రాలను సమర్పించనున్నారు. శివయ్యకు తలపాగా, అమ్మవారికి చీర, శనగల బసవన్న, వినాయకుడికి పంచె, నవనందులను గాలి గోపురాన్ని అలంకరించేందుకు వస్త్రాలను నేశారు. మల్లికార్జున స్వామికి 366 మూరల పొడవు, 48 సెంటీ మీటర్లు వెడల్పు ఉన్న తలపాగా, భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్ల పసుపు అంచుచీర, శనగల బసవన్నకు 6 మీటర్ల అరుణవర్ణ అంచెపంచె, వినాయకుడికి 6 మీటర్లు ఎరుపు అంచు పంచెలను నేశారు. ఇక్కడి వాండ్రంగి వీధికి చెందిన ఆకాశం ముఖలింగం 33 సార్లు శ్రీశైలం వెళ్లి మల్లన్నకు వస్త్రాలను సమర్పించారు. లావేటి వీధికి చెందిన బూడిద చిన్నారావు 21 సార్లు స్వామికి వస్త్రాలను సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement