●మహేంద్రజాలం
మందస/ఇచ్ఛాపురం రూరల్: మహా శివరాత్రి సందర్భంగా తూర్పు కనుమల్లో ప్రశస్త్యమైన మహేంద్ర గిరులు భక్తులతో కనువిందు చేస్తున్నాయి. రాత్రంతా వెలిగే దీపాల వెలుగులు, మంత్రోచ్ఛరణలు ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చుదిద్దుతున్నాయి. పాదయాత్రగా కొండను అధిరోహిస్తారు. ఈ కనుమలు గంజాం జిల్లా ఒడిశా–ఆంధ్రా సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. మందస గ్రామానికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. కుంతీదేవి, ధర్మరాజు ఆలయం, భీముడు, అర్జునుడి ఆలయం, పరశురాముడి విగ్రహాల సందర్శన ఓ ప్రత్యేక అనుభూతి. పాండవులు లింగ ప్రతిష్ట అనంతరం వారు ఈ మార్గం గుండా వెళ్లారని పురాణ కథనం. మందస నుంచే కాకుండా పర్లాకిమిడి నుంచి కూడా భక్తులు వెళ్తారు. బరంపురం, చీకటి ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులు జరడా మీదుగా వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉంది.


