నేటి నుంచి క్రికెట్ పోటీలు
జి.సిగడాం : మహా శివరాత్రి సందర్భంగా రాజాం జోన్ స్థాయిలోని ఉపాధ్యాయులకు ఆదివారం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఎస్‌ఓ బెనర్జీ, పీడీలు జి.రాహుల్‌కుమార్, ఎం.వైకుంఠరావు తెలిపారు. ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావులతో కలిసి శనివారం వారు మాట్లాడుతూ పాలఖండ్యాం మైదానంలో జరిగే పోటీలకు ఉదయం 8 నుంచి రేగిడి, సంతకవిటి, రాజాం, వంగర, జి.సిగడాం, కొత్తూరు మండలాల ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మొదటి బహుమతి రూ.8 వేలు, రెండో బహుమతి రూ.4వేలు చొప్పున అందిస్తామన్నారు. భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.


