నాటుసారాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

నాటుసారాపై ఉక్కుపాదం

Feb 13 2026 5:29 AM | Updated on Feb 13 2026 5:29 AM

నాటుస

నాటుసారాపై ఉక్కుపాదం

నాటుసారాపై ఉక్కుపాదం ● ముగ్గురు వ్యక్తులు అరెస్టు కంచిలి/మందస: సోంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధి కంచిలి, మందస మండలాల పరిధిలో ఎకై ్సజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది సంయు క్తంగా నాటుసారా అమ్మకాలు, తయారీ స్థావరాలపై గురువారం దాడులు చేశారు. దీనిలో భాగంగా కంచిలి మండ ల పరిధి మఠంసరియాపల్లి గ్రామంలో బుడ్డెపు త్రినాథ్‌ అనే వ్యక్తి నుంచి 5 లీటర్లు, డోలగోవిందపురం గ్రామంలో కృష్ణ చంద్రనాయక్‌ నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీరి ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మందస మండలంలోని అంబుగాం గ్రామంలో దాడులు చేసి 900 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే పులియబెట్టిన బెల్లపు ఊటల్ని ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాతో సవర అర్జున్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాటుసారా తయారీకి బెల్లం సరఫరా చేసిన మందసకు చెందిన బెల్లం వ్యాపా రి మీద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు నాటుసారా అమ్మకందారులను సోంపేట కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ దాడుల్లో సోంపేట ఎకై ్సజ్‌ సీఐ జీవీ రమణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ మధుకుమార్‌, సిబ్బంది అరుణ్‌, భానుప్రసాద్‌, మార్కారావు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలి మెళియాపుట్టి: మండలంలోని చీపురుపల్లి గ్రామానికి చెందిన ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు గ్రామ సర్పంచ్‌ ఈశ్వరరా వు తెలిపారు. గురువారం టెక్కలి జిల్లా కోర్టుకు హాజరై సమస్యలను జడ్జి దృష్టిలో పెట్టామన్నారు. గత 270 రోజులుగా నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను సైతం అధికారులు పట్టించుకోలేదని, 2,700 ఎకరాల భూమి త్యాగం చేసినా న్యాయం దక్కలేదని నిర్వాసితుల తరపు లాయర్‌ వాదించారు. కోర్టుదీనిపై స్పందించి తదుపరి మార్చి 4కు విచారణ వాయిదా వేసినట్లు వెల్లడించారు. పటాయత్‌ ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌ కన్నుమూత

మందస: మందస రాజవంశీయులు, టెరిటోరియల్‌ ఆర్మీ మాజీ అధికారి పటాయత్‌ ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌(78) గుండెపోటుతో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఉన్న ఖార్వేలనగర్‌లో మరణించారు. ఆయన మరణంతో మందస, ఒడిశాలో విషాదచాయలు అలముకున్నాయి. దివంగత రాజ జగన్నాథ రాజమణి రాజ్‌ దేవ్‌ ద్వితీయ కుమారుడైన ప్రతాప్‌ కేసరి సింగ్‌ దేవ్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. ఈయన గతంలో టెరిటోరియల్‌ ఆర్మీలో అధికారిగా సేవలందించిన నేపథ్యం పురస్కరించుకుని 120 ఐఎన్‌ఎఫ్‌ బీఎన్‌(టీఏ) సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో బంధువులు, మిత్రులు, ప్రజలు పాల్గొన్నారు.

నాటుసారాపై ఉక్కుపాదం 1
1/2

నాటుసారాపై ఉక్కుపాదం

నాటుసారాపై ఉక్కుపాదం 2
2/2

నాటుసారాపై ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement