ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Feb 13 2026 5:29 AM | Updated on Feb 13 2026 5:29 AM

ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆది శంకరాచార్యులపై చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆరామ ద్రావిడ సంఘం ప్రతినిధులు అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ, వనమాలి వెంక టరమణమూర్తిశర్మ, శృంగారం ధనుంజయ శర్మ, దార్లపూడి రవిశర్మలు ఖండించారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన జీ యర్‌స్వామి వ్యాఖ్యలు ఆధారాలు లేనివని మండిపడ్డారు. విమర్శలను నిరూపించే సత్తా అతని కి ఉందా అని ప్రశ్నించారు. ఆది శంకరాచార్యులు చతుర్మయీ పీఠం స్థాపించి నాలుగు వేదాలను స్థాపించారని తెలిపారు. ఆయన తర్వాత రామాచార్యులు, ఆగ్రచార్యులు, భాస్కరాచార్యులు ఈ పీఠాలను నిర్వహించారని, ఇదంతా చారిత్రాత్మకమైనది గుర్తు చేశారు. రామరాయి పీఠం, నాలుగు వేదాలు, శివతత్వంను భోదించే శిలాఫలకాలు ఉన్నాయన్నా రు. పంచాయతనాలు, సుబ్రహ్మణ్య పీఠం ఇందుకు నిదర్శనమని వివరించారు. చిన జీయర్‌స్వామి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement