ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ● తొలగించకపోతే మీపై చర్యలు తప్పవు ● పలాసలో అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

● తొలగించకపోతే మీపై చర్యలు తప్పవు ● పలాసలో అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. పలాస నియోజకవర్గంలో ఇష్టానుసారంగా భూ ఆక్రమణ లు, కంకర తవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్‌ పర్యటించారు. పలు వివాదాస్పద స్థలాలను పరిశీలించారు. సూదికొండ సర్వే నంబరు 51లో డీ పట్టా భూము ల్లో ఇతర వ్యక్తులు ఎలా ఉన్నారని , ఆ భూముల్లో ఏం సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారికి నోటీసులు ఇవ్వాలని తహశీల్దారును ఆదేశించారు. డి పట్టా భూములను అడుగుతున్న సమయంలో మండల సర్వేయరు గిరి సరైన సమాధా నం చెప్పకపోవడంతో అక్కడికక్కడే సస్పెండ్‌ చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబరు 52 లో ఉన్న లే అవుట్‌కు అనుమతులు లేవని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని కోసంగిపురం కూడలి వద్ద సర్వే నంబరు 67లో డి.పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని బొడ్డపాడు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. పలాస జగన్నాథసాగరం ఆక్రమణ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు గర్భాన్ని ఆక్రమిస్తుంటే మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా వేసిన లేఅవుట్‌ ను తక్షణమే తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం వంశధా ర ఇరిగేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ చెరువు పనులు తక్షణమే ప్రారంభించి ఆ ఫొటోలు పంపించాలని ఆదేశించారు. చిన్న చిన్న సమస్యల ను కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఆర్డీవో వెంకటేశ్‌ను ప్రశ్నించారు తహశీల్దారు కళ్యాణచక్రవర్తిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే శిరీషా, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఏపీ ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరా వు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, బి.నాగ రాజు, ఎం.నరేంద్ర, కొరికాన శంకర్‌, సవర రాంబా బు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement