కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు జడ్జి
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం ఆదికూర్మనాథాలయంలో కూర్మనాథున్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా విచ్చేసిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం గోత్రనామాలతో పూజ లు చేయించారు. ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో స్థానాచార్యలు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, తహశీల్దార్ మునగవలస చక్రవర్తి, పట్నాన రామచంద్రరావు పాల్గొన్నారు.


