పొదల్లోకి దూసుకెళ్లిన బైక్
మెళియాపుట్టి : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలైన ఘటన మెళియాపుట్టి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి పండాపురం కాలనీకి చెందిన బెహరా జగదీష్, బండి త్రినాథ్‌లు శుభకార్యం నిమిత్తం మెళియాపుట్టికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఏకలవ్య పాఠశా ల సమీపానికి వచ్చేసరికి బైక్ నడుపుతున్న త్రినాథ్‌కు కళ్లు తిరగడంతో అదుపుతప్పి పొద ల్లోకి దూసుకెళ్లిపోయారు. ఇద్దరికీ గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం : జిల్లా సమగ్ర శిక్షలో సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఏడుగురిపై చర్యలు తీసుకుంటూ ఎస్పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 29న రాష్ట్రస్థాయిలో ఇంజినీర్ల సమావేశం నిర్వహించగా ఏడుగురు సైట్ ఇంజినీర్లు గైర్హాజరయ్యారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన ఎస్పీడీ వీరిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఏపీసీకి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సవ్యంగా జరిగేందుకు ఏడుగురిని వేరొక ప్రాంతానికి బదిలీ చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులు వెనక్కి మళ్లడంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి వీరు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మూకళ్ల షణ్ముఖరావు (అఖిల్) గుండెపోటు తో మృతి చెందాడు. అఖిల్ ఐదేళ్లుగా ఢిల్లీలో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. ప్రిపరేషన్‌తో పాటు నిరుద్యోగ యువత ఒత్తిడి సమస్యలను అధిగమించేందుకు ఆన్‌లైన్‌లో మోటివేటర్‌గా పరిష్కారాలు చెబుతుండేవాడు. యూపీఎస్‌సీ ఫలితాల్లో ఒక్క మార్కుతో పోస్టు కోల్పోయా డు. ఈ క్రమంలో ఈ నెల 23న గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈయన మృతదేహం సోమవారం స్వగ్రామం కల్లేపల్లికి రానుంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు లక్ష్మణరావు సుశీల విషాదంలో మునిగిపోయారు.
పొదల్లోకి దూసుకెళ్లిన బైక్


