● ఆలయాల్లో సామూహిక సూర్యనమస్కారాలు ● వందలాదిగా హాజరైన అ
శ్రీకాకుళం కల్చరల్ : రథసప్తమి సందర్భంగా ఆదివారం పలుచోట్ల సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్టు, షిరిడీసాయి యోగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ–బి కాలనీలో షిరిడిసాయి మందిరంలో 108 సూర్యనమస్కారాలు జరిగాయి. కార్యక్రమంలో యోగా గురువు రామారావు, మురళి, హరిప్రసాద్, మధు విలేకర్, తంగి స్వాతి, కొంక్యాన వేణు, సింతు సుధాకర్, దుంపల చిన్నబాబు, పాల్గొన్నారు. నారాయణ తిరుమల యోగా సెంటర్‌లో జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. బలగలోని ఆదిత్య విద్యానిలయం ప్రిన్సిపాల్ దేసూళ రమేష్, కరస్పాండెంట్ రాము ఆధ్వర్యంలో విద్యార్థులతో హరేరామ మందిరం ప్రాంగణంలో సామూహిక సూర్యనమస్కారాలు, ఆసనాలు చేయించారు.
● ఆలయాల్లో సామూహిక సూర్యనమస్కారాలు ● వందలాదిగా హాజరైన అ
● ఆలయాల్లో సామూహిక సూర్యనమస్కారాలు ● వందలాదిగా హాజరైన అ


