దర్శనంలో కోతలు | - | Sakshi
Sakshi News home page

దర్శనంలో కోతలు

Jan 20 2026 7:54 AM | Updated on Jan 20 2026 7:54 AM

దర్శన

దర్శనంలో కోతలు

పల్లెవెలుగులే నాన్‌స్టాప్‌లుతిరుగు ప్రయాణాలు భారంగా మారుతున్నాయి. బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. –8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
పల్లెవెలుగులే నాన్‌స్టాప్‌లుతిరుగు ప్రయాణాలు భారంగా మారుతున్నాయి. బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. –8లో
డబ్బులివ్వడానికే దాతలు

మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, ఆర్టీసీ ఆరోగ్య శాఖల అధికారులతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొదటి, రెండో ఏడాదికి ఇంటర్‌ థియరీ పరీక్షలకు 39,838 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరి కోసం 71 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకూ జరుగుతాయని పరీక్షల కోసం 119 కేంద్రా లను కేటాయించామని, జంబ్లింగ్‌ విధానంలో నిష్పక్షపాతంగా పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 71 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 831 మంది ఇన్విజిలేటర్లతో కూడిన భారీ యంత్రాంగం ఈ పరీక్షా విధుల్లో పాల్గొంటుందని, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఇంట ర్మీడియెట్‌ విద్యాధికారి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆదిత్యుని సన్నిధిలో

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్‌ శర్మ ఆలయ కార్య నిర్వహణ అధికారి కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తదితరులు స్వా గతం పలికారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. రవిచంద్ర ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు.

ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల మృత్యుఘోష

వజ్రపుకొత్తూరు రూరల్‌: సముద్ర జీవుల్లో అరుదైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రభుత్వ నిషేధిత వలలు, బోట్‌లను వినియోగిస్తూ మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండటంతో బోటు కింద ఉన్న రంపాలకు, వలలకు తగిలి తాబేళ్లు చనిపోతున్నాయి. ప్రధానంగా నువ్వలరేవు, కొత్తూరు, అక్కుపల్లి, డోకులపాడు, గుణుపల్లి, మంచినీళ్లపేటతో పాటు పలు తీరాలకు ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు వచ్చి మృత్యువాత పడి అవే తీరాలకు వాటి కళేబరాలు కొట్టుకువస్తున్నాయి. దీంతో పర్యాటకులతో పాటు ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

రసవల్లి దేవస్థానానికి రూ.లక్ష విరాళం ఇస్తే జీవిత కాలం ఏటా రథసప్తమి సందర్భంగా నలుగురు ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశం ఇన్నాళ్లు ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తూట్లు పొడించింది. దీంతో పాటు దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనం పాసుల విషయంలోనూ కోతలు పెడుతున్నారు. రకరకాల నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేవస్థానానికి వచ్చే విరాళాలు తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పండగ పూట ప్రత్యేక దర్శనం టిక్కెట్లు తీసుకుంటే సరిపోతుందనే ఆలోచనకు భక్తులు వచ్చే అవకాశం ఉంది.

దాతలపై పగెందుకు..

అరసవల్లి దేవస్థానం దాతలపై పాలకులు కక్ష కట్టారు. పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ఆనవాయితీకి తిలోదకాలిస్తున్నారు. గత ఏడాది దాతల సాయంతో నిర్మించిన కట్టడాలను ఆధునికీకరణ, పునర్నిర్మాణం పేరుతో వారికి తెలియకుండానే కూల్చేశారు. ఇప్పటివరకు వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టలేదు. ప్రతి రూ.లక్ష విరాళానికి నలుగురు ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు డోనర్‌ పాసు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. రూ. లక్ష విరాళం ఇచ్చిన భక్తులకు నలుగురికి ప్రత్యేక దర్శనం చేసుకునేలా దేవస్థానం పాసులిస్తూ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాతలపైనే పడ్డారు. దేవస్థానం అభివృద్ధికి దోహదపడుతున్న దాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

మూడు దశాబ్దాల సంప్రదాయానికి తూట్లు

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి పాలకులు తూట్లు పొడిచారు. రూ.లక్ష కట్టిన భక్తులకు రథసప్తమి నాడు నలుగురికి ప్రత్యేక దర్శనం పాసులు ఇచ్చే ఆనవాయితీకి గండి కొట్టారు. ఇకనుంచి నలుగురికి బదులు ముగ్గురికి మాత్రమే ప్రత్యేక దర్శనం కల్పిస్తామని కోత పెట్టారు. అంతేకాకుండా దేవస్థానానికి రూ.లక్ష చెల్లించినట్టు రశీదులు చూపించాలంటూ కొత్త కండిషన్‌ పెట్టారు. వాస్తవంగా రూ.లక్ష ఇచ్చిన దాతల పేర్లు ప్రత్యేక రికార్డులో నమోదై ఉంటాయి. ఆ రికార్డులు చూడకుండా ఇప్పుడు ఎప్పుడో ఇచ్చిన విరాళాల రశీదును తీసుకొస్తేనే డోనర్‌ పాసులిస్తామంటూ మెలిక పెట్టారు. దీంతో దాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్ష కట్టినప్పుడు ఇలాంటి నిబంధనలు చెప్పకుండా, గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూటమి ప్రభుత్వంలో కొత్త సంప్రదాయానికి తెరలేపడాన్ని భక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. పాలకులు, ఉన్నతాధికారుల నిర్ణయం, ఆదేశాలంటూ ఆలయ అధికారులు భక్తులకు చెప్పి తెలివిగా తప్పించుకుంటున్నారు. ఫలితంగా రథసప్తమికి సంబంధించిన దాతల పాసుల కోసం వెళ్లే భక్తులు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్‌లో రూ.లక్ష కట్టిన భక్తులకు రథసప్తమి వేళ జీవిత కాలం ప్రత్యేక దర్శనానికి సంబంధించి కుదించే ఆలోచన చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు గానీ అదే జరిగితే దాతలను ప్రోత్సహించే విషయంలో అడ్డుకట్ట వేసినట్టవుతుంది.

తిరుపతి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో రూ.లక్ష డొనేట్‌ చేస్తే ఏటా ఆరుగురికి రూ.300 దర్శనం పాసులిచ్చి గౌరవిస్తారు. అలాంటిది ఇక్కడ నేతల జోక్యంతో దాతలను అగౌరవ పరిచేలా వ్యవహరిస్తున్నారు. దాతలకు ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమావేశం రేపు

పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో 21 వ తేదీన సాయంత్రం 3 గంటలకు పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నామని పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు హాజరవుతారని పార్టీ నియోజకవర్గాల సమ న్వయకర్తలు, పార్టీ కమిటీ ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. అలాగే పార్టీ పార్లమెంట్‌ పరిశీలకులు, పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌, రాష్ట్ర కార్యదర్శి (సమన్వయం, పార్లమెంట్‌) జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా సంస్థాగత కార్యదర్శి, జిల్లా కార్యకలాపాల కార్యదర్శి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఆఫీస్‌ మేనేజర్‌, జిల్లా మీడియా ఇన్‌చార్జి తదితరులు విధిగా హాజరుకావాలని కోరారు.

పాలకా.. మీకిది భావ్యమా

అరసవల్లి దేవస్థానం దాతలకు మరోసారి అవమానం

గత ఏడాది పరిస్థితులు పునరావృతం

రూ. లక్ష ఇచ్చిన భక్తులకు ముగ్గురు దర్శనం చేసుకోవడానికి మాత్రమే అనుమతి

ఎప్పుడో చెల్లించిన విరాళాల రశీదులు చూపించాలంటూ కొత్త కండీషన్‌

దాతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీత

అధికారులపై భగ్గుమంటున్న భక్తులు

ఇంటర్‌ పరీక్షలకు డీఈసీ కమిటీ నియామకం

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్ష–2026లకు జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్స్‌ కమిటీ (డీఈసీ) కమిటీ నియామకమైంది. ఈ కమిటీకి జిల్లా కన్వీనర్‌గా ఆర్‌.సురేష్‌కుమార్‌, కమిటీ సభ్యులగా బి.శ్యామ్‌సుందర్‌ (ప్రిన్సిపాల్‌, జీజేసీ ఆమదాలవలస), ఎస్‌.భీమేశ్వరరావు (ప్రిన్సిపాల్‌, నౌపడ), ఎస్‌.అన్నపూర్ణారావు (సీనియర్‌ ఫిజిక్స్‌ జేఎల్‌, శ్రీకాకుళం బాలికలు), బీటీవీ మంగపతి (ఓఏ ఒకేషనల్‌ జేఎల్‌, పాతపట్నం) నియామకం కాగా, డిస్ట్రిక్ట్‌ బల్క్‌ అధికారిగా టి.జగదీశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

గత ఏడాది దాతల సాయంతో నిర్మించిన అన్నదాన మండపం, ప్రసాదాల కౌంటర్‌, సూర్య నమస్కారాల మండపం, మరుగుదొడ్ల కాంప్లెక్స్‌, ప్రసాదాల తయారీ కేంద్రం, భక్తులకు నీడనిచ్చే జింకు రేకు షెడ్లు, క్యూలైన్లను కూల్చివేసింది.

వాటిని నిర్మించేందుకు సహకరించిన దాతల కు మాటైనా చెప్పుకుండా కూల్చివేసిన పాలకులు, నేటికి ఏడాది దాటుతున్నా వాటిస్థా నంలో కొత్తవి నిర్మించకుండా, సంబంధిత దాతలను వెక్కిరించేలా వ్యవహరించారు.

ఎన్ని రూ.లక్షలు కడితే అన్ని పాసులు ఇవ్వాల్సిన సమయంలో కోతలు పెట్టారు.

పాసుల విషయంలో ఆంక్షలు పెట్టారు. దీంతో దాతలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. అధికారులతో గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి.

రూ.లక్ష కట్టిన దాతలు ముందుగా వచ్చి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సరికొత్త నిబంధన కూడా పెట్టారు.

డోనర్స్‌కు ప్రత్యేకంగా ఉండాల్సిన లైనును రూ.500 టిక్కెట్ల క్యూలైన్‌లో కలిపేశారు. ఇవ న్నీ దాతలను ఇబ్బందులకు గురి చేశాయి.

1996 నుంచి దేవస్థానానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కల్పించే గౌరవానికి తిలోదకాలిచ్చారు. దీంతో రూ.లక్షలు కట్టిన భక్తులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మండి పడుతున్నారు.

అయినప్పటికీ పాలకుల తీరు మారలేదు. ఈ సారి కూడా అదే ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

దర్శనంలో కోతలు1
1/4

దర్శనంలో కోతలు

దర్శనంలో కోతలు2
2/4

దర్శనంలో కోతలు

దర్శనంలో కోతలు3
3/4

దర్శనంలో కోతలు

దర్శనంలో కోతలు4
4/4

దర్శనంలో కోతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement