డయేరియా
చవితి సీదిలో
● ఆహారం కలుషితమైందని అంటున్న అధికారులు
● గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు అస్తవ్యస్తం
హిరమండలం: చవితి సీది గ్రామంలో డయేరియా ప్రబలింది. గత రెండు రోజులుగా గ్రామంలో పది మంది డయేరియా బారిన పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పండగ సమయంలో ఆహారం కలుషితం కావడం కారణంగానే డయేరియా ప్రబలిందని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. కాలువల్లో మురు గు నీరు పేరుకుపోయింది. డ్రైనేజీ పనులు చేపట్టకపోవడంతో కాలువల నుంచి మురుగు నీరు పైకి ప్రవహిస్తోంది. అటు చేతి పంపు బో ర్లతో పాటు బావుల వద్ద అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. పాడుబడిన బావిని అలానే విడిచిపెట్టడంతో అందులో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తోంది. దోమలు సైతం స్వైరవిహారం చేస్తున్నాయి.
నరసన్నపేట ఆస్పత్రిలో ముగ్గురు..
ప్రస్తుతం గ్రామంలో పది మంది డయేరియా బారినపడ్డారు. వీరిలో నలుగురు కోలుకున్నారు. బూర్లే రాము, శైలాడ నాగరత్నం, అంధవరపు అప్పన్న నరసన్నపేటలో సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. శైలాడ శాంతి కుమారి, బూర్లె బుడ్డె మ్మ, బూర్లె సాయిరాజు గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హిరమండలం పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికుమార్‌తో పా టు వైద్య సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. బాధితులకు వైద్యసేవలందించారు. తాగునీటి వనరుల వద్ద క్లోరినేషన్ చేపడుతున్నారు. కాలువలు, బోర్లు, బావుల వద్ద బ్లీచింగ్ చల్లారు. ఎంపీడీఓ ఆర్.కాళీప్రసాద్‌తో, డిప్యూటీ ఎంపీడీఓ గోవిందరావు గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలో
చికిత్స పొందుతున్న
మహిళ
సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్న
బాధితుడు
జాగ్రత్తలు తీసుకోవాలి
డయేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మేరీ కేథరిన్ సూచించారు. వారు చవితి సీది గ్రామాన్ని సందర్శించారు. వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి వ్యాధి పీడితుల కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు సూచించారు. ఇంటింటా సర్వే చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటప్పలనాయుడు ఏఈ సాగర్‌లు గ్రామంలో ఉన్న తాగునీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.
డయేరియా
డయేరియా
డయేరియా
డయేరియా


