సేవా సృజన.. సూర్యారాధన
అరసవల్లి: దివిలి హేమచంద్ర.. ప్రముఖ శిల్పి దివిలి అప్పారావు తనయుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న హేమచంద్ర కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే శిల్పకళలోనూ రాణిస్తున్నారు. తండ్రి అప్పారావు కూడా సాహసించని శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టు నమూనా విగ్రహాన్ని హేమచంద్ర కేవలం 30 రోజుల్లోనే తయారు చేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. 2023లో నాటి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాఠ్కర్ ఉగాది నాడు స్వా మి సన్నిధిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత అదే ఏడాదిలో మూలపేట పోర్టు శంకుస్థాపనకు విచ్చేసిన నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తొలి బహుమతిగా దీన్ని జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ అందజేశారు.
‘ఫైబర్ మెటీరియల్‌తో తొలిసారిగా ఆదిత్యుని నిజరూప విగ్రహ నమూనాను అడుగున్నర ఎత్తులో తయారు చేశాను. దీన్ని మరింత తగ్గించి విగ్రహాలను తయారు చేయాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారని శిల్పి హేమచంద్ర వివరించారు. స్వామి వారి నిజరూపాన్ని శిల్పంగా మలచడం తన పూర్వజన్మ సుకృతం అని హేమచంద్ర అన్నారు.
సేవా సృజన.. సూర్యారాధన
సేవా సృజన.. సూర్యారాధన


