హెలికాప్టర్ రైడ్
నేనే తొలి రైడర్‌ను
గత ఏడాది రైడింగ్ కోసం ప్రయత్నం చేశారు. కాని ఎక్కలేకపోయాను. అందుకే ఈ సారి మొదటి రోజు మొదటి బ్యాచ్‌లో రైడ్ చేశా. చాలా సంతోషంగా ఉంది. – ప్రదీప్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు. సోమవారమే ఈ రైడ్ ప్రారంభమైంది. 26 వరకు హెలికాప్టర్ రైడ్ ఉంటుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. ఆయన సోమవారం లాంఛనంగా తొలి బ్యాచ్‌ను ప్రారంభించారు.
రోజుకి 250 నుంచి 300 వరకు
ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటల వరకు అంటే వెలుతురు ఉన్నంత వరకు 26వ తేదీ వరకు ప్రతి రోజూ హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. రైడింగ్ ప్రారంభానికి ముందే టికెట్ కౌంటర్ తెరుస్తారు. రోజుకు 250 నుంచి 300 వరకు టికెట్లు ఇస్తారు.
టికెట్ అక్కడే
డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు బుకింగ్ చేయాలన్నా, అడ్వాన్స్ బుకింగ్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. రూ.2200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.
బరువు ఆధారంగా బ్యాచ్‌లు
హెలీకాప్టర్ రైడింగ్‌లో రైడర్ బరువు ప్రధానం. ఈ బరువును బట్టే ఒక బ్యాచ్‌లో ఎంత మందిని ఎక్కించాలన్నది అక్కడున్న సిబ్బంది నిర్ణయి స్తారు. సాధారణంగా ఆరుగురిని ఒక బ్యాచ్‌లో రైడింగ్‌కు ఎక్కిస్తారు. వీరు అంతా కలిపి 500 కిలోల కంటే తక్కువ బరువు ఉండాలి.
రైడర్లకు ప్రసాదం
హెలీకాప్టర్ రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చి న్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తుండేలా ఫొటో, ప్రసాదాలను ఇస్తున్నారు.
తొలిరోజు 107 మంది
తొలిరోజు దాదాపు 107 మంది హెలికాప్టర్‌లో విహరించారు. 15 బ్యాచ్‌లుగా విడదీసి వీరిని హెలికాప్టర్ ఎక్కించారు. చిన్నపిల్లలను ఒక్కో బ్యాచ్‌లో అదనంగా ఎక్కించారు. తొలిరోజు రూ.2,43,400లు ఈ రైడ్ ద్వారా వసూలయ్యాయి.
5 నిమిషాలు మాత్రమే..
హెలికాప్టర్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు మినహా 5 నిమిషాల పాటు గాలిలో విహరిస్తుంది. నగరం నలుమూలలా తిప్పుతారు.
హెలికాప్టర్ రైడ్


