● బొంతు.. ఎండుతోంది గొంతు | - | Sakshi
Sakshi News home page

● బొంతు.. ఎండుతోంది గొంతు

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

● బొంతు.. ఎండుతోంది గొంతు

● బొంతు.. ఎండుతోంది గొంతు

మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతు గ్రామంలో తాగునీటి సరఫరా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో గతంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. కొన్నేళ్ల కిందట జలజీవన్‌ మిషన్‌ పథకం మంజూరు కావడంతో స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో బోరు ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా పాత కుళాయి లైన్లు తొలగించి కొత్తగా ఇంటింటికీ కుళాయి లైన్లు వేశారు. కొత్త బోరు ద్వారా నీరు అనుకున్నంతగా సరఫరా కావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. – సారవకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement