జనవిజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పెట్రోల్ నిక్షేపాల కోసం వెనెజులా దేశంపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంచేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ అందరిలో శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు, ప్రజల కోసం సైన్సు – ప్రగతి కోసం సైన్స్–స్వావలంబన కోసం సైన్స్– పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్ అనే నినాదాలతో జనవిజ్ఞావేదిక పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరావు, జిల్లా సహాధ్యక్షుడు బి.ధనలక్ష్మి, మహిళా విభాగం కన్వీనర్ కె.శాంతి ప్రియ, మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ కన్వీనర్ సీహెచ్ రాజు, ఆమదాలవలస డివిజన్ నాయకులు కె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.


