రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం అర్బన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ఆర్‌టీవో గంగాధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మనమంతా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్‌కుమార్, ఎ.గంగరాజు, ఎస్‌ఎం ఎంపీ రావు, అధికారులు ఏఎన్‌ఎస్ శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


