వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..

Jan 3 2026 8:03 AM | Updated on Jan 3 2026 8:03 AM

వినూత

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ.. ● ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న మహిళలు ● అత్యుత్తమంగా బోధన ● నేడు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ●అంతర్జాతీయ స్థాయిలో... ●ఆట.. జీవితానికి బాట ●‘లెక్క’ తప్పేదే లేదు

● ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న మహిళలు ● అత్యుత్తమంగా బోధన ● నేడు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

ఇచ్ఛాపురం రూరల్‌: తరగతి గదిలో జ్ఞాన దీపాలు వెలిగిస్తూ, సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారు పలువురు మహిళా ఉపాధ్యాయులు. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా విలువలు–వినయం–విజ్ఞానం నేర్పుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తల్లిలాంటి స్నేహం, గురువు లాంటి క్రమశిక్షణను విద్యార్థులకు అందిస్తూ పిల్లలను కంటిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొంత మంది ఉపాధ్యాయినుల గురించి అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె పేరు బూరవెల్లి ఉమామహేశ్వరి. తరగతిలో సామాన్య విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠం చెప్పడం ఈమె ప్రత్యేకత. టీఎల్‌ఎంతో పాటుగా, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫ్లో చార్టులు, ప్రోజెక్ట్‌, బృంద కృత్యాలతో ప్రతి విద్యార్థి అన్నింటిలో భాగమయ్యేలా ప్రోత్సహిస్తుంటారు. నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ‘సారాభాయి టీచర్‌ సైంటిస్ట్‌’ అవార్డుతో గౌరవించింది. గత ఏడాది ఆగస్టులో న్యూ ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతులు మీదుగా ఉత్తమ బహుమతి అందుకున్నారు.

ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఊర్మిళా కుమారీ రథోకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. ఇచ్ఛాపురం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అథ్లెటిక్స్‌లో పాల్గొని బహుమతులు సాధించారు. బీపీఈడీ పూర్తిచేసి వ్యాయోమాపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రాజపురం గర్‌ల్స్‌ హైస్కూల్లో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె ప్రస్తుతం లొద్దపుట్టి ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, యోగా విద్యలో తర్ఫీదు ఇస్తున్నారు.

ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యా యురాలిగా పనిచేస్తున్న పి.హేమలత గణితం సులభంగా బోధిస్తుంటా రు. లెక్కలంటే భయపడే విద్యార్థులకు ఆమె పాఠం మొదలు పెడితే తర గతి అంతా నిశ్శబ్ధం అలముకుంటోంది. కష్టతరమైన లెక్కల్ని సైతం అలవోకగా చెబుతుంటారు. మరోవైపు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యత లు నిర్వర్తిస్తూ బడికి బాసటగా నిలుస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల కు పబ్లిక్‌ పరీక్షల సన్నద్ధతపై స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు.

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ.. 1
1/3

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ.. 2
2/3

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ.. 3
3/3

వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement