● డాక్టర్.. స్కేటర్
శ్రీకాకుళం రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఆర్.వెంకట రమ్యశ్రీ రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకం సాధించింది. ఈ నెల తొమ్మిది నుంచి 11 వరకు విశాఖపట్నంలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పథకం సాధించింది. ఆల్ఫెన్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించిన రమ్యశ్రీ డౌన్‌హిల్ ఈవెంట్ లో కూడా కాంస్య పథకాన్ని సాధించింది. రమ్యశ్రీ ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్ డాక్టర్ సనపల నరసింహమూర్తి డాక్టర్ బి.గౌరునాయుడు తదితరులు అభినందించారు.
– శ్రీకాకుళం
● డాక్టర్.. స్కేటర్
● డాక్టర్.. స్కేటర్


