ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి సూచించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ ప్రతులు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.


