పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి | - | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి

Dec 16 2025 4:18 AM | Updated on Dec 16 2025 4:18 AM

పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి

పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్‌ సిగ్నల్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరజీవి త్యాగాన్ని తప్పక స్మరించుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.సాయి ప్రత్యూష, బీసీ వెల్ఫేర్‌ అధికారి అనురాధ, స్థానిక తహసీల్దార్‌ గణపతి రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement