నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను శనివా రం వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ చేపట్టనున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు జూనియర్స్ కేటగిరిలో, 9, 10 తరగతుల విద్యార్థులకు సీనియర్ కేటగిరిలో చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలుంటాయని వివరించారు. ఆసక్తి గల వారు శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 9440812387, టెక్కలి డివిజన్‌లో 9440812389, పలాస డివిజన్‌లో 9440907281 నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు పొదుపు ఆవశ్యకతను వివరించేలా అవగాహన కలిగేలా సిబ్బందితో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.


